మరాఠి చిత్రం ‘దేవూల్ బంద్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో మే 21న విడుదలైన ఈ సినిమా, కేవలం 9 రోజుల్లోనే రూ. 40.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక మహిళా రైతు జీవితం, శ్రీస్వామి సమర్థ్ చుట్టూ తిరిగే ఈ కథకు లభించిన పాజిటివ్ మౌత్ టాక్ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపింది.