నారాయణపేట జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు. బాలికల చదువుతోనే బాల్య వివాహాలను నిర్మూలించడం సాధ్యం అవుతుందన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా నారాయణపేట కలెక్టరేట్లో స్నేహ సంఘాల కిషోర బాలికల చేత నిర్వహించిన మాక్ పార్లమెంట్‌ను ఎస్పీ వినీత్‌తో కలిసి తిలకించారు.