MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్ని కళాశాలలో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. సుమారు 350 మంది విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కౌన్సిలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.