ADB: రైతులు పండించిన పంటలను మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశమై మాట్లాడారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగతా ధాన్యం డబ్బులను త్వరలోనే విడుదల చేయటం జరుగుతుందని వెల్లడించారు.