TG: కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం చామవరంలో నిర్వహించే ప్రజావేదికలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం లబ్ధిదారుల ఇళ్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందించనున్నారు. అనంతరం గ్రామంలోని కార్యకర్తలతో సమావేశం కానున్నారు. చంద్రబాబు పర్యటనకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.