PLD: కొండవీడులోని జిందాల్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదివారం పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల కోసం 268 పంచాయతీల్లో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 6 ప్లాంట్లు స్థాపిస్తామని పేర్కొన్నారు.