GDWL: జనాభా గణన–2027లో భాగంగా చేపట్టిన ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గద్వాల కలెక్టర్ క్యాంపు కార్యాలయ వివరాలను సేకరించిన ఎన్యూమరేటర్లకు ఆయన స్వయంగా సమాచారం అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలుకు గణన కీలకమని పేర్కొన్నారు. సెన్సెస్ విజయవంతానికి ప్రజలు సహకరించాలని కోరారు.