VKB: మండల పరిధిలోని మదనంతపూర్ తాండ, కొండాపూర్ గ్రామాల శివారుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక నిల్వలను పోలీసులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 50 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించి, వాటిని వెంటనే సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.