WGL: నగరంలోని ఎంజీఎం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్ను సీపీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వ్యసనాల నుంచి బయటపడేందుకు రోగులకు కౌన్సెలింగ్ అందించాలన్నారు.