HYD: ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోల్ నుంచి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం), బోడుప్పల్ నుంచి అంబర్పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని, అవసరమైతే ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు.