KMR: బహుజన బిడ్డ పల్లె రమేష్ గౌడ్ పై కొంత మంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.