AP: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తానని నకిలీ సిఫార్సు లేఖలతో భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది నుంచి నిందితుడు నవీన్ రూ.36 వేలు వసూలు చేశాడు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.