TG: బస్సు ఆపలేదని నల్గొండ వద్ద RTC డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి పొన్నం స్పందించారు. దీనిపై జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. విధుల్లో ఉన్న RTC సిబ్బందిపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అయితే, డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.