SRD: చెరుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఆదుకోవాలని సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ అన్నారు. మనూరు మండలం తోర్నాల్ గ్రామంలో నేడు చెరుకు రైతులతో సైంటిస్ట్ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులు సమావేశమయ్యారు. ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ రైతులు చెరుకును సాగు చేస్తున్నారని, అధిక దిగుబడులు వచ్చేలా, సస్యరక్షణ చర్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.