SRD: బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం మే 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరంలోపు గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని కోరారు.