SS: మొక్కజొన్న, వేరుశనగ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. బుధవారం పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉషశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతోందని విమర్శించారు.