MBNR: తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ చూపిన మాల విద్యార్థులకు సన్మానించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దుమర్ల నిరంజన్ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. మారిన సమాజ పరిస్థితిని బట్టి ఏఐ టెక్నాలజీని సొంతం చేసుకోవాలన్నారు. రాష్ట్ర, జిల్లా మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.