MGL: కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెంలో ఆదివారం లక్ష్మీదేవర బోనాల జాతర ప్రారంభం కానుంది. ఈ జాతర రెండు రోజుల పాటు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.