JGL: కొత్త బస్టాండ్లో పారిశుధ్య లోపం ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. టాయిలెట్ల పరిసరాలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడంతో బస్టాండ్ మురికివాడను తలపిస్తోంది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.