TG: మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంథనిలో బస్‌స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు గోదావరి నది మహాహారతిలో పాల్గొననున్నారు.