GNTR: ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా రానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన జీఎస్టీ, ఇతర రిజిస్ట్రేషన్లు, అనుమతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన మంగళగిరి సీఏ మద్ది నిఖిల్ను మంత్రి నారా లోకేష్ శనివారం ఉండవల్లి నివాసంలో అభినందించారు. రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం కానుందని లోకేష్ తెలిపారు.