వరంగల్ జిల్లాలో పాఠశాల వయస్సు గల ప్రతి బిడ్డను బడిలో చేర్పించడమే లక్ష్యంగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ప్రొ. జయశంకర్ బడిబాట అమలుపై ఆమె జిల్లా స్థాయి అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత సంవత్సరం కంటే 10 శాతం అదనంగా ప్రవేశాలు పెంచాలని సూచించారు.