BHPL: భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలో శ్రీపతి జస్వంత్(17) చెరువులో మునిగి మృతి చెందాడు. శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన జస్వంత్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గ్రామస్తులు మృతదేహాన్ని వెలికితీయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.