ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు, లిక్కర్ మార్ట్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు మున్సిపల్ కమిషనర్‌కు శనివారం వినతిపత్రం అందజేశాయి. మద్యం ప్రభావంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని, రాత్రి 9 గంటల తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, బెల్ట్ షాపుల ద్వారా మద్యం సరఫరా జరుగుతోందని పేర్కొన్నాయి.