W.G: ఉపాధి హామీ పనుల్లో ముఖ ఆధారిత ఫేస్ యాప్ను తక్షణమే రద్దు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జక్కం శెట్టి సత్యనారాయణ, కౌరు పెద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మొగల్తూరులో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పాత పద్ధతిలోనే మాన్యువల్ మస్తర్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.