PDPL: కుటుంబ క్షేమం కంటే సమాజ సేవ కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై కె. వేణుగోపాల్, ఏఎస్సై ఎం.సురేందర్ రెడ్డిలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఎక్కువ గడపాలన్నారు.