WGL: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఖిలా వరంగల్లోని ఖుష్ మహల్లో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలు విజయవంతంగా జరిగేలా అన్ని శాఖలు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.