SDPT: జిల్లాలోని 419 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించిన ఆమె.. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తహశీల్దార్లు సూచించారు.