ASF: పెంచికల్ పేట్ మండలం చెడ్వాయిలో నీటి కుంటలో పడి డోబి చింటూ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చింటూ సెలవుల కోసం కాగజ్ నగర్ నుంచి చెడ్వాయిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించారు. బుధవారం గ్రామ సమీపంలోని కుంటలో శవమై తేలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.