NRPT: మక్తల్ మండలం గోలపల్లి నుండి మంథన్ గోడ్ రోడ్డుకు 1 కోటి 50లక్షల రూపాయలతో నిర్మాణం చేయనున్న నూతన వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శంఖుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ గతంలో మక్తల్ను ఎవ్వరూ పట్టించుకోలేదని, రోడ్లు పెద్దగా ఉంటేనే గ్రామాలకు గౌరవం పెరుగుతుందన్నారు. రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోతే వారికి ఇండ్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.