WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే రెండవ తేదీ వరకు ప్రభుత్వం బాలల భద్రత, రక్షణ వారోత్సవాలను నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ తెలిపారు. అందులో భాగంగానే నేడు జిల్లాలోని బాల సదనం చిన్నారులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఏర్పాటు చేయించి వారికి పత్రాలను అందజేశారు. బాలల సంరక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యత అన్నారు.