ADB: నార్నూర్ మండలం జామడలో గురువారం 9వ ఆదివాసీ ఇప్ప పువ్వు పండుగను నిర్వహించనున్నట్లు రాయ్ సెంటర్ ప్రతినిధి మెస్రం దుర్గు పటేల్ తెలిపారు. ఆదివాసీ సంస్కృతి పరిరక్షణతో పాటు ఇప్ప పువ్వులోని పోషక విలువలపై అవగాహన కల్పించడమే ఈ ఉత్సవ లక్ష్యమని పేర్కొన్నారు. ఐటీడీఏ, ప్రజామిత్ర సహకారంతో గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.