GNTR: తెనాలి జగ్గడిగుంటపాలెం శివారు చినరావూరులో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న 61 సెంట్ల ప్రభుత్వ భూమిని MRO గోపాలకృష్ణ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత స్థలం వద్దకు వెళ్ళిన ఆయన రైతు రత్తయ్యతో మాట్లాడి భూమిని స్వాధీన పరుచుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం 5 కోట్ల విలువైన ఈ భూమి కొద్ది సంవత్సరాలుగా ఆక్రమణకు గురైందని చెప్పారు.