KRNL: దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే జనగణనలో భాగంగా మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన ఈ-స్వీయ గణన రేపటితో ముగియనుందని, శుక్రవారం నుంచి గృహ గణన సర్వే ప్రారంభమవుతుందని కమిషనర్ చల్లా ఓబులేసు ఇవాళ తెలిపారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని కోరారు.