AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మొక్కజొన్న రైతులు తెలంగాణకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న ఆయన.. ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన కొరత లేదన్నారు. దీంతో ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు.