తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలవివాదాలపై రేపు జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు(KRMB) సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించాల్సి ఉన్న ఈ భేటీ, తదుపరి ఎప్పుడు నిర్వహించేది బోర్డు త్వరలో ప్రకటించనుంది.