NGKL: జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న పంటను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నేత నాగం శశిధర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. 15 నుంచి 20 రోజులుగా నిల్వలు తరలించకపోవడంతోనే పంట తడిసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతులకు అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చి, వెంటనే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.