అక్కినేని అఖిల్ ‘లెనిన్’ జూన్ 26న విడుదల కానున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపాడు. నిన్న రాత్రి మూవీ ఫస్ట్ కట్ చూశామని, సినిమాలో కొత్త అఖిల్‌ను చూస్తారన్నాడు. ఈ విషయాన్ని పూర్తి నమ్మకంతో చెబుతున్నట్లు ట్వీట్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, జూన్ 25న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ కానుంది.