నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీను బుధవారం మరికల్ మండలంలోని ఐకేపీ, పీలేరు స్టేజీ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వడ్లలో తాలు లేకుండా జాగ్రత్త పడాలని, తూకం పూర్తికాగానే వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామకోటి, విజయ్ కుమార్, పరశురాం, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.