JN: ఫతేపూర్ గ్రామంలోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ఆలస్యం, లారీల కొరతపై అధికారులను నిలదీశారు. 15 రోజులుగా రైతుల వడ్లు పెండింగ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. నీటి సమస్యపై కూడా స్పందించి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.