TG: పది ఫలితాలు వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. మార్కుల వేటలో పడి మనసు గాయపరుచుకోవద్దు. అలాగే పిల్లలపై ఒత్తిడి పెంచే మాటలు తల్లిదండ్రులు మానుకోవాలి. పక్కింటివాళ్లు, బంధువుల పిల్లలతోనో పోల్చవద్దు. ఈ విశాలమైన ప్రపంచంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఓటమి.. ఓ కొత్త పాఠం నేర్పుతుంది.