దక్షిణ సూడాన్‌లో జుబా నగారనికి సమీపంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో పాటు 13 మంది ప్రయాణికులు మృతిచెందారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ఇద్దరిని కెన్యా జాతీయులుగా, మిగిలిన వారిని దక్షిణ సూడాన్ వాసులుగా గుర్తించారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.