CTR: గత ఎన్నికల్లో40 శాతం ఓట్లు వచ్చినా 11 సీట్లకే పరిమితం అయ్యామని.. ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ఆలోచించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ బీఎల్ఏలకు సదుం మండలం యర్రాతివారిపల్లెలో శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఎలాగైనా సరే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు.