NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీఐటీయూ రాష్ట్ర సీనియర్ నాయకులు పెన్నా అనంతరామ శర్మ మూడవ వర్ధంతిని ఇవాళ నల్గొండలో నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి అవుట రవీందర్, ఇతర నేతలు పాల్గొని నివాళులు అర్పించారు.