NDL: డోన్ పట్టణంలోని పాతపేట ప్రభుత్వ ఆసుపత్రి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాతపేట ప్రాంత ప్రజలు చాలా కాలంగా ప్రభుత్వ ఆసుపత్రి పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.