AKP: ఉపాధి హామీ పథకం వేతనదారుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ మండలం తానాం గ్రామంలో పని ప్రదేశంలో ఈ మేరకు ఉపాధి కూలీలతో కలిసి ఆందోళన నిర్వహించారు. గతంలో ఉన్న విధానాలను మార్చడం వల్ల వేతనదారులకు పని దొరకడం లేదన్నారు. ముఖ ఆధారిత హాజరు రద్దు చేయాలన్నారు. సమ్మర్ అలవెన్సులు మంజూరు చేయాలన్నారు.