కృష్ణా: ఉంగుటూరు 33/11 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE జి.బి. శ్రీనివాసరావు తెలిపారు. ఉంగుటూరు, ఆముదాలపల్లి, లంకపల్లి, గారపాడు, కొయ్యగురపాడు, పోనుకుమాడు, నాగవరపాడు, తుట్టగుంటపాడు, వెల్దిపాడు, వేంపాడు, తరిగొప్పల గ్రామాల్లో ఉండదన్నారు.