AP: గుడివాడలో వేంకటేశ్వరస్వామి కిరీటం మాయం వ్యవహారం కొలిక్కివచ్చింది. తాకట్టు నుంచి కోటి రూపాయల స్వర్ణ కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు విడిపించారు. సంప్రోక్షణ చేసి స్వామివారికి అలంకరిస్తామని కమటీ తెలిపింది. నిర్మాణ నిధుల కోసమే తాకట్టు పెట్టినట్లు వెల్లడించింది. తప్పు జరిగిందని ఆలయ ఛైర్మన్ మోహనరావు వివరణ ఇచ్చారు.