W.G: పెనుమంట్ర (M) ఓడూరు గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హామీ కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేసవిలో పని వేళల్లో మంచినీరు, మజ్జిగను పంపిణీ చేయాలని కార్మికులు నినాదాలు చేశారు. ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.