బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాయక్ బీజేపీ ఎస్టీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. దీంతో ఆయనను ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు.